Nayanatara: నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి: నయనతార గురించి విఘ్నేశ్ కామెంట్

Nayanatara is mother of my kids says Vignesh Sivan
  • ఒక పాపను ఎత్తుకున్న నయన్ ఫొటోను పోస్ట్ చేసిన విఘ్నేష్
  • తమ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన వైనం
  • కొంత కాలంగా ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేష్
స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్ లు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వారిద్దరికీ సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా తమ అనుబంధం గురించి విఘ్నేష్ పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు.

మదర్స్ డే సందర్భంగా నయనతార ఒక పాపను ఎత్తుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేశాడు. 'నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు' అని కామెంట్ చేశాడు. తద్వారా తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామనే విషయాన్ని సూటిగా చెప్పాడు. తన పిల్లలకు కాబోయే తల్లి నయనతార అని స్పష్టం చేశాడు.
Nayanatara
Vignesh Sivan
Love
Marriage
Tollywood

More Telugu News