Manmohan singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం కుదుటపడింది..హెల్త్ బులెటిన్ విడుదల

Ex prime Minister Manmohan singhs health bulltein
  • నిన్న మన్మోహన్ సింగ్ కు గుండె నొప్పి
  • చికిత్సకు ఆయన సహకరిస్తున్నారు
  • ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉంచామన్న ఎయిమ్స్ వైద్యులు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గుండె నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మన్మోహన్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ ను ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, చికిత్సకు సహకరిస్తున్నారని పేర్కొంది. మన్మోహన్ కు గుండె నొప్పి రావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని, ప్రస్తుతం ఆయన్ని అబ్జర్వేషన్ లో ఉంచామని అన్నారు. కాగా, నిన్న రాత్రి సమయంలో మన్మోహన్ సింగ్ కు ఛాతీలో నొప్పి రావడంతో ఎయిమ్స్ కి తరలించారు. ఎయిమ్స్ లోని కార్డియో వాస్క్యులర్ సెంటర్ లో చికిత్స కొనసాగుతోంది.
Manmohan singh
Ex-prime minister
AIIMS
Health Bulltein

More Telugu News