Bakery: తన బేకరీలో ముస్లిం ఉద్యోగులు లేరని ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్

Bakery owner arrested in Chennai
  • తన బేకరీలోని ఉత్పత్తులన్నీ జైనులు తయారుచేసినవేనంటూ ప్రచారం
  • ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఫిర్యాదు
  • అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
తన బేకరీలో ముస్లిం ఉద్యోగులు లేరని, అందరూ స్వేచ్ఛగా వచ్చి కొనుగోళ్లు చేసుకోవచ్చంటూ ప్రచారం చేసిన ఓ బేకరీ యజమానిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తన బేకరీలోని ఉత్పత్తులన్నీ జైనులు తయారుచేసినవేనంటూ వాట్సాప్ ద్వారా అతడు ప్రచారం చేశాడు.

ముస్లింల కారణంగానే వైరస్ ప్రబలుతోందని, కాబట్టి తన బేకరీలో ముస్లింలు లేరు కాబట్టి నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చని అర్థం వచ్చేలా అతడు చేసిన ప్రచారం వివాదాస్పదమైంది. అతడి ప్రచారం ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న ఫిర్యాదుతో స్పందించిన మాంబళం పోలీసులు కేసు నమోదు చేసి బేకరీ యజమానిని అరెస్ట్ చేశారు.
Bakery
Chennai
Tamil Nadu

More Telugu News