Chiranjeevi: తమ మాతృమూర్తుల ఫొటోలు పోస్ట్ చేసి చిరంజీవి, మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

chiranjeevi and mahesh on mothers day
  • మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చిరు, మహేశ్
  • తల్లితో నాగబాబు, పవన్‌ దిగిన ఫొటోలను పోస్ట్ చేసిన చిరు
  • తన తల్లి, భార్య ఫొటోలు పోస్ట్ చేసిన మహేశ్
మాతృదినోత్సవం సందర్భంగా సినీనటులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విట్టర్‌ ఖాతాలో తన తల్లికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు తాను తల్లితో తీసుకున్న ఫొటోలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. జీవితంలో మనకు సంబంధించిన ప్రతి కథ వెనుక మన తల్లి కథ ఉంటుందని చెప్పారు. ఎందుకంటే అమ్మకు సంబంధించిన కథతోనే మనందరం జీవితాలను మొదలుపెట్టామని అన్నారు.

మాతృదినోత్సవం సందర్భంగా మహేశ్ బాబు తన తల్లి ఫొటోతో పాటు తన భార్య ఫొటోను కూడా పోస్ట్ చేశారు. 'నా జీవితానికి మార్గదర్శకాలుగా నిలిచింది వీరిద్దరే. అసాధారణ ప్రేమ కురిపించే మాతృమూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే' అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
Chiranjeevi
Mahesh Babu
Tollywood

More Telugu News