Mumbai: యూకే నుంచి 326 మందితో వచ్చిన తొలి విమానం.. ముంబైలో ల్యాండింగ్

First evacuation flight from UK landed in Mumbai
  • ఈ తెల్లవారుజామున 1:30 గంటలకు ముంబై చేరుకున్న విమానం
  • క్వారంటైన్ కేంద్రాలుగా హోటళ్లను సిద్ధం చేసిన ప్రభుత్వం
  • బయటి వారిని జిల్లాల హెడ్ ‌క్వార్టలకు తరలింపు

కరోనా వైరస్ కారణంగా బ్రిటన్‌లో చిక్కుకుపోయిన వారిలో తొలి విడతగా 326 మంది భారతీయులు ముంబై చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల ప్రాంతంలో వీరిని తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా విమానం నగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. అందరికీ ప్రొటెక్టివ్ కిట్లు ఇచ్చారని, స్నాక్స్, భోజనం పెట్టారని తెలిపాడు.  ఇక క్వారంటైన్‌కు వెళ్లడమేనని అతడు పేర్కొన్నాడు.  యూకే నుంచి ముంబైకి క్షేమంగా చేరుకున్నామని మరో ప్రయాణికుడు ట్వీట్ చేశాడు.  

కరోనా లక్షణాలతో వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించనుండగా, వైరస్ సోకీ లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ముంబైకి చెందిన వారిని హోటళ్లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు. బయటి వారిని ఆయా జిల్లాల హెడ్‌క్వార్టర్లకు ప్రభుత్వం తరలించనుంది.

  • Loading...

More Telugu News