Maharashtra: ముంబై ఆసుపత్రిలో ఉరేసుకున్న 60 ఏళ్ల కరోనా రోగి

Corona positive victim Suicide in Mumbai Hospital
  • ఇటీవలే ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు
  • పైజమాతో ఉరేసుకున్న వైనం
  • ఆసుపత్రిలో కలకలం
కరోనా వైరస్‌తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఓ రోగి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ముంబైలో జరిగిందీ ఘటన. నగరంలోని విఖ్రోలికి ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో బాధపడుతూ మరోల్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఏమైందో ఏమో కానీ, తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోని 9వ అంతస్తులో నిన్న తన పైజమా సాయంతో ఉరేసుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రిలో కలకలం రేగింది.

మరోవైపు, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 20,228 మంది వైరస్ బారినపడగా, 779 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,800 కోలుకున్నారు. వైరస్ తాకిడి అధికంగా ఉన్న ముంబైలో 12,864 కేసులు నమోదయ్యాయి. 489 మంది మరణించారు. 
Maharashtra
Mumbai
Corona Virus
Suicide

More Telugu News