మాస్క్ లేకపోతే బాదుడే.. ఏఐ సిస్టంను రంగంలోకి దించుతున్న హైదరాబాద్ పోలీసులు
- మాస్కులు లేకుండా రోడ్డుపైకి వస్తే వెయ్యి ఫైన్
- రెండు, మూడు రోజుల్లో ఏఐ సిస్టమ్ ను అమలు చేయనున్న నగర పోలీసులు
- ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు
మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ను పోలీసులు వాడబోతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ టెక్నాలజీని అమలు చేయబోతున్నారు. ఆ తర్వాత దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ వివరాలను హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.
నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తికి ఏ విధంగా చలాన్లు పంపించాలనే విషయాన్ని వర్కౌట్ చేస్తున్నామని చెప్పారు. మొబైల్ ద్వారా చలాన్ పంపించాలా? లేక మరేదైనా ఇతర మార్గం ద్వారా పంపించాలా? అనే విషయంపై కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.