Amit Shah: నాకెలాంటి జబ్బు లేదు... నిక్షేపంగా ఉన్నాను: పుకార్లపై స్పందించిన అమిత్ షా

Amit Shah respond on rumors on his health
  • అమిత్ షా ఆరోగ్యంపై పుకార్లు
  • ఇప్పటికే ఖండించిన జేపీ నడ్డా
  • పూర్తి అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నానన్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం బాగాలేదంటూ పుకార్లు వినిపిస్తున్నాయని, వాటిని తాము ఖండిస్తున్నామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇప్పటికే ప్రకటన చేశారు. తాజాగా, అమిత్ షా కూడా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, తాను ఎలాంటి జబ్బుతో బాధపడడంలేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా తన విధులను సంపూర్ణ అంకితభావంతో నిర్వర్తిస్తున్నానని తెలిపారు.

దేశం కరోనా వైరస్ తో తల్లడిల్లుతున్న వేళ తాను విధి నిర్వహణలో తలమునకలుగా ఉన్నానని, ఇలాంటి రూమర్లను పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. రూమర్ల విషయం తనకు తెలిసినా, సదరు వ్యక్తుల వికృత మనస్తత్వానికే ఆ విషయం వదిలేశానని, అందుకే మొదట్లో స్పందించలేదని తెలిపారు. అయితే, లక్షలమంది పార్టీ కార్యకర్తలు బాధపడుతుండడంతో స్పందించక తప్పలేదని అమిత్ షా వివరణ ఇచ్చారు.
Amit Shah
Rumors
Health

More Telugu News