Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపై నోరు విప్పిన ఆమె తల్లి!

Rakul Preet Singhs mother gives clarity on her marriage
  • సినిమాలతో రకుల్ బిజీగా ఉంది
  • ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు
  • రకుల్ కోరుకున్న వ్యక్తితో వివాహం జరిపిస్తాం
టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ పై ఇటీవలి కాలంలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. వాటిలో... త్వరలోనే రకుల్ పెళ్లిపీటలు ఎక్కబోతోందనే వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తలపై రకుల్ తల్లి స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, సినిమాలతో రకుల్ బిజీగా ఉందని చెప్పారు. ఇప్పట్లో ఆమె పెళ్లి ఆలోచన లేదని తెలిపారు. రకుల్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనితో వివాహం జరిపిస్తామని చెప్పారు.

మరోవైపు, ప్రస్తుతం సినిమాల్లో రకుల్ జోరు కొంచెం తగ్గింది. బాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. టాలీవుడ్ లో చివరగా నాగార్జున సరసన 'మన్మథుడు2' సినిమాలో నటించింది. కమల్ సరసన 'భారతీయుడు2'లో అవకాశం దక్కించుకున్నప్పటికీ... లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.
Rakul Preet Singh
Marriage
Mother
Bollywood
Tollywood

More Telugu News