Nimmagadda Ramesh: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాజ్యం .. తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

  Nimmagadda Ramesh Kumars case judgement reserved
  • నియామక నిబంధనల ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ పిటిషన్ 
  • ఎస్ఈసీ కార్యదర్శి రాత పూర్వక వాదనలు దాఖలు చేయాలి
  • సోమవారం వరకు గడువు ఇచ్చిన న్యాయస్థానం
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఎస్ఈసీ కార్యదర్శి సోమవారం లోగా రాతపూర్వక వాదనలు దాఖలు చేయాలని గడువు ఇచ్చింది. ఈ మేరకు ఎస్ఈసీ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.
Nimmagadda Ramesh
Ex-Sec
AP High Court

More Telugu News