Two Heads Snake: రెండు తలల పామును షేర్ చేసిన అధికారి.. వీడియో ఇదిగో!

- ఒడిశా అటవీ ప్రాంతంలో రెండు తలల పాము గుర్తింపు
- వేర్వేరుగా పని చేస్తున్న రెండు తలలు
- సురక్షితంగా అడవిలో వదిలిపెట్టిన అధికారులు
ఒడిశాలో రెండు తలలతో కనిపించిన పాము జనాలను ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ఈ పాముకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. నేల మీద పాము పాకుతుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో రెండు తలలు కలిగిన ఈ పామును ఒడిశా కియోంజార్ జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో గుర్తించారు. ఆ తర్వాత దాన్ని అడవిలో సురక్షితంగా వదిలేశారు.
ఈ రెండు తలల పాము విషరహితమైనది. రెండు తలలు ఉండటంతో... దీనికి నాలుగు కళ్లు, రెండు నాలుకలు ఉన్నాయి. శరీరం ఒకటే అయినా... రెండు తలలు వేర్వేరుగా పని చేస్తున్నాయి. ఈ రెండు తలలు వేర్వేరుగా ఆహారం కోసం వెతుకుతున్నాయని 'ది మిర్రర్' పత్రిక తన కథనంలో తెలిపింది.