అఘోర పాత్రపై దృష్టిపెట్టిన బాలకృష్ణ!

Boyapati Movie
  • బోయపాటితో బాలకృష్ణ మూడో సినిమా
  • కవల సోదరులుగా కనిపించనున్న బాలకృష్ణ
  • లాక్ డౌన్ ముగియగానే షూటింగ్ మొదలు  
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉంటాయి. అందుకు కారణం గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు భారీ విజయాలు ఉండటమే. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కవల సోదరులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. వీటిలో ఒక పాత్ర రాయలసీమ నేపథ్యంలోను, మరో పాత్ర వారణాసి నేపథ్యంలోను సాగుతాయని అంటున్నారు.  

రాయలసీమ పౌరుషాన్ని చాటే పాత్రలను గతంలో బాలకృష్ణ రక్తి కట్టించే వున్నారు. అఘోర పాత్రలో కనిపించనుండటం మాత్రం ఇదే మొదటిసారి. అందువలన ఆయన అఘోరాల తీరు తెన్నులు .. వాళ్ల వేషధారణ .. ప్రవర్తించే తీరు .. వాళ్ల  బాడీ లాంగ్వేజ్ ఎలా వుంటుందనే విషయాలను బాలకృష్ణ పరిశీలిస్తున్నారట.

వాళ్ల జీవన శైలిపై పూర్తి అవగాహన కోసం అందుకు సంబంధించిన పుస్తకాలను కూడా బాలకృష్ణ చదువుతున్నారని అంటున్నారు. ఈ పాత్ర బాలకృష్ణ కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
Go Back to Shorts
Balakrishna
Boyapati Sreenu

More Telugu News