Iran: ఇరాన్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన జనం

Casualties reported earthquake hits Iran
  • రిక్టర్ స్కేలుపై 5.1గా తీవ్రత నమోదు
  • ఒకరి మృతి.. ఏడుగురికి గాయాలు
  • భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
గత అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల ప్రాంతంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్టు ఆ దేశ వైద్య శాఖ అధికార ప్రతినిధి కియానుష్ జహాన్‌పూర్ తెలిపారు. టెహ్రాన్‌కు ఈశాన్యంగా దమావాండ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.
Iran
earth quake
Tehran

More Telugu News