Naga Chaitanya: 13 B హారర్ థ్రిల్లర్ సీక్వెల్లో చైతూ

13 B Movie
  • తమిళంలో హిట్ కొట్టిన '13 B'
  • తెలుగులోను విజయవంతం
  •  సీక్వెల్ కి సన్నాహాలు  
నాగచైతన్య ఇటీవల కాలంలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విజయాలను తన ఖాతాలో జమ  చేసుకుంటూ వెళుతున్నాడు.  అలా 'మజిలీ' .. 'వెంకీమామ' సినిమాలతో హిట్లు అందుకున్న చైతూ, తాజాగా దర్శకుడు విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ప్రస్తుతం విక్రమ్ కుమార్ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులనే చక్కబెడుతున్నాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సారి విక్రమ్ కుమార్ ఎలాంటి కథను ఎంచుకున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో తమిళంలో ఘన విజయాన్ని సాధించిన '13 B' అనే హారర్ థ్రిల్లర్ కి ఈ సినిమా సీక్వెల్ అని తెలుస్తోంది. 2009లో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఆ సినిమా, తెలుగులోను విజయాన్ని అందుకుంది. కథాకథనాల పరంగా ఈ సినిమా మొదటి నుంచి చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మాధవన్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా సీక్వెల్లోనే ఇప్పుడు చైతూ చేయనున్నాడని అంటున్నారు.  ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Naga Chaitanya
Vikram Kumar
13 B Movie

More Telugu News