Geetha Madhuri: గీతా మాధురి అక్కడ ఇబ్బంది పడుతుందని నేను ముందే అనుకున్నా: నందూ

Nandu comments on Geetha Madhuri
  • గీత వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియదు
  • బిగ్ బాస్ తొలి వారంలో చాలా ఇబ్బంది పడింది
  • ఆ తర్వాత ఆమెను అందరూ అర్థం చేసుకున్నారు
సినీ నటుడు నందూ, సింగర్ గీతా మాధురిల జంటకు అన్యోన్యమైన జంటగా గుర్తింపు ఉంది. కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా దంపతులిద్దరూ ఒకరికొకరు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందూ మాట్లాడుతూ, బిగ్ బాస్ లో తన భార్య గీతా మాధురి ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పాడు. అందరికీ గీత ఒక మంచి సింగర్ అని మాత్రమే తెలుసని... ఆమె వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియదని అన్నాడు. గీత ఏదీ మనసులో దాచుకోలేదని... ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఆమె నైజమని తెలిపాడు.

బిగ్ బాస్ లో గీత ఇబ్బంది పడుతుందని తాను ముందే అనుకున్నానని నందూ చెప్పాడు. తాను అనుకున్నట్టే తొలి వారంలో ఆమె చాలా ఇబ్బంది పడిందని  తెలిపాడు. సోషల్ మీడియాలో కూడా ఆమెపై విమర్శలు మొదలయ్యాయని చెప్పాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెను అందరూ అర్థం చేసుకున్నారని... అందరికీ మంచి స్నేహితురాలు అయిందని తెలిపాడు.
Geetha Madhuri
Nandu
Bigg Boss
Tollywood

More Telugu News