Narendra Modi: విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై మోదీ అత్యవసర భేటీ.. అమిత్‌ షా సహా పాల్గొన్న కేంద్ర మంత్రులు, అధికారులు

modi meets ministers on vizag gas leak tragedy
  • హాజరైన రాజ్‌నాథ్ సింగ్, కిషన్‌ రెడ్డి
  • గ్యాస్‌ లీక్ ప్రాంత పరిస్థితులపై సమీక్ష
  • సహాయ చర్యలకు ఏర్పాట్లు
విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇప్పటికే ఏపీలోని అధికారులకు ఫోన్‌ చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారులు పలు వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ లీక్‌ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన సదుపాయాలపై మోదీకి అధికారులు పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు అందించడం, అందుకు అవసరమైన వైద్య పరికరాలు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన అన్ని సహాయక చర్యలపై చర్చలు జరుపుతున్నారు.
Narendra Modi
Amit Shah
Kishan Reddy
Vizag
Vizag Gas Leak

More Telugu News