మే 31న మహేశ్ కొత్త ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం!

Parashuram Movie
  • ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు
  • పరశురామ్ మూవీ నుంచి ఫస్టులుక్
  • లైన్లో ఇద్దరు దర్శకులు  
ఈ నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. మహేశ్ బాబు తాజా చిత్రం నుంచి టైటిల్ తో కూడిన ఫస్టు పోస్టర్ ను ఆ రోజున రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా నుంచి మహేశ్ బాబు ఫస్టులుక్ ను వదలాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరో రెండు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఆ రోజున వెలువడనున్నట్టు చెబుతున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అన్ని రకాల పనులను పూర్తి చేసుకుని సెట్స్ పైకి  వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోగా మహేశ్ బాబు రెండు సినిమాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు సినిమాలకి సంబంధించిన ప్రకటన మే 31వ తేదీన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.  ఆ ఇద్దరు దర్శకులు ఎవరు? కథా నేపథ్యం ఏమిటి? మహేశ్ బాబు పాత్ర ఎలా వుండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.  దాంతో కృష్ణ పుట్టినరోజు కోసం అభిమానులంతా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
Go Back to Shorts
Mahesh Babu
Krishna
Parashuram

More Telugu News