Narendra Modi: విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనపై ప్రధాని మోదీ స్పందన

Spoke to officials of MHA and NDMA regarding the situation in Visakhapatnam
  • పరిస్థితులపై హోం శాఖ, ఎన్‌ఎమ్‌డీఏ అధికారులతో మాట్లాడానన్న మోదీ
  • ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని వ్యాఖ్య
  • షాక్‌కు గురి చేసిందన్న బీజేపీ నేత జీవీఎల్ 
విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 'విశాఖపట్నంలోని పరిస్థితులపై హోం శాఖ, ఎన్‌ఎమ్‌డీఏ అధికారులతో మాట్లాడాను. అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాము. విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను' అని చెప్పారు.  

కరోనా వంటి వైరస్‌తో పోరాడుతున్న సమయంలో విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ ఘటన చోటు చేసుకోవడం షాక్‌కు గురి చేసిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాయని చెప్పారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Narendra Modi
India
Vizag

More Telugu News