Allu Arjun: ప్రయోగాత్మక చిత్రంగా 'ఐకాన్' .. బన్నీ ఆలోచన అదే

Icon Movie
  • అల్లు అర్జున్ తాజా చిత్రంగా  రూపొందుతున్న 'పుష్ప'
  • తదుపరి సినిమా దర్శకుడిగా వేణు శ్రీరామ్
  • త్వరలోనే మిగతా వివరాలు  

అల్లు అర్జున్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'అల వైకుంఠపురములో' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఇద్దరి కెరియర్లోను చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా కంటే ముందుగా అల్లు అర్జున్ 'ఐకాన్'  సినిమా చేయవలసి వుంది. వేణు శ్రీరామ్ ఈ  సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.  

'అల వైకుంఠపురములో' తరువాత అల్లు అర్జున్  'ఐకాన్' చేయవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆయన సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'  చేయడానికి  సిద్ధమవుతున్నాడు. 'ఐకాన్' విషయంలో అల్లు అర్జున్ కావాలనే ఆలస్యం చేస్తున్నాడనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇది ప్రయోగాత్మక చిత్రమని తెలుస్తోంది. అయితే ఈ తరహా సినిమా చేయాలంటే కొంత ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వుంటుందట. అందువలన కొంత గ్యాప్ తరువాత ఈ సినిమా చేయడమే కరెక్ట్ అని ఆయన భావించినట్టుగా చెప్పుకుంటున్నారు. సుకుమార్ సినిమా తరువాత వేణు శ్రీరామ్ సినిమానే అల్లు అర్జున్ చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు  త్వరలోనే తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News