Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samantha attends online classes
  • ఆన్ లైన్ క్లాసెస్ కి సమంత 
  • శంకర్ తో చిరంజీవి సినిమా?
  • ఏమాత్రం తగ్గని హీరో సూర్య
*  అందాలతార సమంత ఇప్పుడు నటనలో ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందుతోంది. ప్రస్తుతం ఆన్ లైన్ తరగతులకు ఆమె హాజరవుతోంది. ఈ విషయాన్ని తనే వెల్లడించింది. 'ఇకపై మంచి నటిని అనిపించుకుంటాను. ఒకవేళ అలా అనిపించుకోకపోతే కనుక ఈ పోస్టుని డిలీట్ చేస్తా' అంటూ పేర్కొంది.  
*  ప్రముఖ తమిళ దర్శకుడు ఎన్.శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్లో సినిమా కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదు. అలాంటిది ఇప్పుడు ఈ కాంబోలో చిత్రాన్ని నిర్మించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
*  ఎగ్జిబిటర్లు ఎంతగా భయపెడుతున్నప్పటికీ, తమిళ హీరో సూర్య తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోవడం లేదు. తన భార్య జ్యోతిక నటించిన 'పొన్ మగల్ వందాల్' చిత్రాన్ని ముందుగా ఓటీటీ ద్వారా విడుదల చేస్తానని చెప్పడంతో ఎగ్జిబిటర్లు సూర్య చిత్రాలను ఇకపై థియేటర్లలో విడుదల చేయమంటూ హెచ్చరించిన సంగతి విదితమే. అయినప్పటికీ సూర్య ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు. ముందుకి వెళ్లడానికే నిర్ణయించుకున్నాడట.
Samantha
Chiranjeevi
Shankar
Surya

More Telugu News