Uttar Pradesh: క్యూలో నిల్చోలేడట.. భర్త కోసం మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లిన భార్య!

Wife bought liquor for Husband in Uttar Pradesh
  • ఉత్తరప్రదేశ్‌లోని సోనాపూర్ ప్రాంతంలో ఘటన
  • 40 రోజులుగా తన భర్త మద్యానికి దూరంగా ఉన్నాడని ఆవేదన
  • ఎండలో గంటలపాటు నిల్చుని మద్యం కొనుగోలు
లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తన భర్త మద్యం ముట్టడం లేదని తెగ బాధపడిపోయిన ఓ భార్యామణి.. షాపులు తెరిచీ తెరవగానే మద్యం కొనుగోలు చేసి భర్తకు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌‌లోని సోనాపూర్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలుసుకున్న అవధ్రాబీ గ్రామానికి చెందిన మహిళ వెంటనే మద్యం దుకాణానికి చేరుకుంది. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున క్యూ ఉండడంతో ఆమె కూడా వరుసలో నిల్చుంది.

ఎండలో చాలాసేపు క్యూలో నిల్చున్న ఆమె ఎట్టకేలకు మద్యం కొనుగోలు చేసి కొంగున చుట్టుకుని బయలుదేరింది. ఆమెను ఆసక్తిగా గమనించిన అక్కడున్న వారు ఆమెను ఆపి విషయం ఏంటని ఆరా తీశారు. ఆమె చెప్పింది విని ఎంత గొప్ప భార్యో అనుకున్నారు. తన భర్త 40 రోజులుగా మద్యం తాగలేదని, ఇంతసేపు ఎండలో నిల్చుని మద్యాన్ని కొనుగోలు చేయలేడని, అందుకే తాను వచ్చానని చెప్పడంతో మందుబాబులందరూ ఆమెను అభినందిస్తూ.. ఇలాంటి గుణవంతురాలిని భార్యగా పొందిన ఆమె భర్త ఎంతటి అదృష్టవంతుడో కదా! అంటూ ఆశ్చర్యపోయారు.
Uttar Pradesh
Liquor
woman

More Telugu News