Tomato: ఎగుమతి అవకాశాలు లేక... ఉల్లి, టమాటా నేలచూపులు!

Onion and Tomato Price Drop in Market
  • లాక్ డౌన్ కు ముందు ఆకాశంలో ధరలు
  • ప్రస్తుతం పంటంతా స్థానిక మార్కెట్లకే
  • భారీగా తగ్గిన కూరగాయల ధరలు
లాక్ డౌన్ ప్రారంభించిన తొలి నాళ్లలో రూ. 50గా ఉన్న కిలో టమాట ధర, రూ. 150 వరకూ ఉన్న ఉల్లి ధర, రూ. 80 వరకూ పలికిన మిర్చి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. నిబంధనల కారణంగా ఎగుమతులు లేక, పంటనంతా రైతులు స్థానిక మార్కెట్లకే తరలిస్తూ ఉండటంతో ధరలు భారీగా పడిపోయాయి.

ప్రస్తుతం హోల్ ‌సేల్‌ మార్కెట్ ‌లో 25 కిలోల టమాట బాక్స్ ధర రూ. 30కి పడిపోగా, రిటైల్‌ మార్కెట్ ‌లో రూ. 10కి రెండు కిలోలు, మూడు కిలోల చొప్పున విక్రయాలు సాగుతున్నాయి. ఇక ఉల్లిగడ్డ విషయానికి వస్తే, 55 కిలోల బస్తా ధర రూ. 650 వరకూ తగ్గింది. అంటే, కిలో రూ. 12కు హోల్ సేల్ మార్కెట్లో లభిస్తుండగా, రూ. 50 కి మూడు కిలోల చొప్పున రిటైల్ మార్కెట్లో విక్రయాలు సాగిస్తున్నారు.

అలాగే పచ్చిమిర్చి ధర కూడా కిలోకు రూ. 25కు దిగొచ్చింది. ఎగుమతులు లేకపోవడం ఇతర కూరగాయలపైనా ప్రభావం చూపింది. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలూ, లాక్ డౌన్ ప్రారంభంతో పోలిస్తే దిగొచ్చాయి.
Tomato
Onion
Price
Wholesale Market
Retail Market

More Telugu News