Sivajiraja: నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్.. ఆసుపత్రికి తరలింపు

Actor Sivaji Raja suffered with heart stroke
  • శివాజీరాజాకు తీవ్ర అస్వస్థత
  • హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స
  • ట్వీట్ చేసిన బీఏ రాజు
సీనియర్ నటుడు శివాజీరాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ లో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ సినీ పీఆర్ఓ బీఏ రాజు ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల లాక్ డౌన్ ప్రకటించిన తొలినాళ్లలో శివాజీరాజా తన ఫామ్ హౌస్ లో పండిన కూరగాయలను, ఇతర నిత్యావసరాలను అవసరమైన వారికి ఉచితంగా అందించారు.
Sivajiraja
Heart Stroke
Star Hospital
Hyderabad
Tollywood

More Telugu News