Alia Bhatt: అలియా భట్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Rajamouli gives clarity on Alia Bhatt
  • తారక్, చరణ్ ల మధ్య వారధిలా ఉండే పాత్ర సీత 
  • సీత చాలా అమాయకంగా ఉండాలి
  • అందుకే అలియా భట్ ను ఎంచుకున్నా
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో 'ఆర్ఆర్ఆర్' సినిమా తెరకెక్కుతోంది. కరోనా కారణంగా షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ... సినిమాకు సంబంధించిన అప్ డేట్లను యూనిట్ సభ్యులు ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రను పోషిస్తుండగా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది. ఆమెను ఎందుకు ఎంపిక చేశారో రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

'ఎంతో టాలెంట్ ఉన్న నటులు తారక్, చరణ్ ల మధ్య ఓ అద్భుతమైన వారధిలా ఉండే 'సీత' పాత్ర కోసం నాకు ఒక నటి కావాలి. ఇది ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ కాదు. సీత అమాయకంగా, హానికి గురయ్యే విధంగా ఉండాలి. అలాగే ఎంతో చలాకీతనంతో వుండాలి. అందుకే నేను అలియాభట్ ను ఎంచుకున్నా' అని రాజమౌళి చెప్పారు.
Alia Bhatt
Rajamouli
RRR
Tollywood

More Telugu News