Chandrababu: మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయి: చంద్రబాబు

Chandrababu press meet
  • ఏపీలో మద్యం షాపులు తెరవద్దని మహిళలు ఆందోళన చేశారు
  • కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి
  • ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆరుగురు చనిపోయారు
ఏపీలో మద్యం దుకాణాలు తెరవద్దని నిన్న కొన్ని చోట్ల మహిళలు ఆందోళన చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా  ఆరుగురు చనిపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ను ఎలా కట్టడి చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘కరోనా’ నేపథ్యంలో క్రమశిక్షణగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలని అన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిస్థితి మన చేతుల్లో ఉండదని అన్నారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh
Liquor
shops

More Telugu News