Chandrababu: ఏపీ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్లతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu comments on AP Government
  • దక్షిణాదిలో ఏపీ మినహా  ఏ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవలేదు
  • నలభై రోజులుగా మద్యం విక్రయాలు జరపలేదు
  • మద్యపాన నిషేధానికి ఇంతకంటే మంచి సమయం లేదు 
ఏపీలో మద్యం దుకాణాలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. దక్షిణాదిలోని ఏ రాష్ట్రంలో కూడా మద్యం దుకాణాలు తెరవలేదని అన్నారు. మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్లే అమ్ముతున్నారని, ఈ బ్రాండ్లను వినియోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని విమర్శించారు. నలభై రోజులుగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరపలేదని, మద్యపాన నిషేధానికి ఇంతకంటే మంచి సమయం లేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో మాత్రం విచ్చలవిడిగా మద్యం దుకాణాలు తెరిచారని మండిపడ్డారు. మద్యం దుకాణాలను పోలీసులతో నియంత్రిస్తారా? ఆ దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెడతారా? అని ప్రశ్నించారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh
liquor
YSRCP

More Telugu News