anasuya: మన వరకు వస్తే కానీ బుద్ధి రాదన్న మాట.. అన‌సూయ షాకింగ్‌ ట్వీట్!

anasuya on vijay devara konda
  • విజయ దేవరకొండ పేరును ప్రస్తావించని అనసూయ
  • మండిపడుతున్న నెటిజన్లు
  • ఇలాంటి ట్వీట్ చేయడం సరికాదని కామెంట్లు
కొన్ని వెబ్‌సైట్లు తన గురించి పలు రకాలుగా వార్తలు రాయడం పట్ల సినీనటుడు విజయ్‌ దేవరకొండ  మండిపడ్డ విషయం తెలిసిందే. తనపై నాలుగు వెబ్‌సైట్లు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఆయనకు సినీ పరిశ్రమ నుంచి భారీగా స్పందన వస్తుండగా యాంకర్ అనసూయ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించకుండా ఆమె ఓ ట్వీట్ చేసింది. 'మన వరకు వస్తే కానీ బుద్ధి రాదన్న మాట.. హుమ్' అంటూ ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఈ విషయంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ భారీగా కామెంట్లు చేస్తున్నారు. 'మీరు చెప్పింది నిజమే అనసూయ గారూ.. మనదాకా వస్తే కానీ ఎవరికీ నొప్పి తెలియదు. కానీ ఇప్పటికన్నా వాళ్లు ముందుకు వస్తున్నపుడు మీలాంటి వాళ్లు కూడా సపోర్ట్ చేయండి. ఇలాగే వదిలేస్తే మీలాంటి సెలెబ్రిటీలు ముందు ముందు కూడా చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

విజయ్ దేవరకొండపై ఆమె ఇటువంటి కామెంట్ చేయడం సరికాదని చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో ఆ సినిమాలో 'అమ్మ'పై విజయ్ దేవరకొండ చేసిన అసభ్యకర డైలాగుపై అనసూయ అప్పట్లో మండి పడింది. ఇటువంటి పదాలు సమాజంలో మాట్లాడుకుంటూనే ఉంటారని అప్పట్లో విజయ్ దేవరకొండ కూడా దీటుగా విమర్శలకు సమాధానం ఇచ్చాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అనసూయ ట్వీట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
anasuya
Vijay Devarakonda
Tollywood

More Telugu News