Chiranjeevi: డియర్ విజయ్ దేవరకొండ.. అంటూ చిరంజీవి ట్వీట్

Chiranjeevi Tweet to Vijaya Devarakonda
  • మీ ఆవేదనను అర్ధం చేసుకోగలను
  • బాధ్యతలేని రాతల వల్ల.. మీలా నేనూ బాధపడ్డాను
  • ఇలాంటి రాతల వల్ల నువ్వు చేసే మంచి పనులు ఆపొద్దు
  • నీకు అండగా మేము ఉంటాం
లాక్ డౌన్ నేపథ్యంలో పేదల సహాయార్థం తన ఫౌండేషన్ తరపున విరాళాలు సేకరిస్తున్న హీరో విజయ్ దేవరకొండ పై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను ఖండించిన విజయ్ కు మద్దతుగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖలు నిలిచారు. తాజాగా, ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. ‘కిల్ ఫేక్ న్యూస్’ హ్యాష్ టాగ్ తో ఓ ట్వీట్ చేశారు.

‘డియర్ విజయ్..  మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల, మీలా నేను, నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. విజయ్ కు అండగా నిలుస్తామని. ఇలాంటి రాతల వల్ల చేసే మంచి పనులు ఆపవద్దని విజయ్ ని కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు కూడా ఓ రిక్వెస్ట్ చేశారు. వ్యక్తి గత అభిప్రాయాలను వార్తలుగా మలచొద్దని అన్నారు.
Chiranjeevi
Tollywood
Vijayadevara konda

More Telugu News