Vijay Devarakonda: మహేశ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda replies Mahesh Babu support
  • ఫేక్ న్యూస్ ప్రచారంపై విజయ్ దేవరకొండ ఫైట్
  • మద్దతు ప్రకటించిన మహేశ్ బాబు
  • థాంక్యూ సర్ అంటూ వినమ్రంగా స్పందించిన విజయ్ దేవరకొండ

కొన్ని వెబ్ సైట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యువ హీరో విజయ్ దేవరకొండకు సూపర్ స్టార్ మహేశ్ బాబు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండకు తాను అండగా నిలుస్తానంటూ మహేశ్ ట్వీట్ చేశారు. దీనిపై విజయ్ దేవరకొండ వెంటనే స్పందించాడు. థాంక్యూ మహేశ్ సర్ అంటూ వినమ్రంగా బదులిచ్చాడు. మనం కలసికట్టుగా పోరాడుదాం, అందుకు ఇదే తగిన సమయం అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఈ జోడీకి ఇతర సినీ ప్రముఖుల నుంచి కూడా క్రమంగా మద్దతు పెరుగుతోంది.

  • Loading...

More Telugu News