Telangana High Court: కాన్పు కోసం 200 కిలోమీటర్లు తిరిగి తల్లీ, బిడ్డ కన్నుమూయడంపై హైకోర్టు ఆగ్రహం

Telangana high court serious on mother and child death incident
  • తెలంగాణలో విషాద ఘటన
  • కాన్పుకోసం అనేక ఆసుపత్రులకు తిరిగిన యువతి
  • సకాలంలో స్పందించని ఆసుపత్రి వర్గాలు
జోగులాంబ గద్వాల జిల్లా యాపదిన్నె ప్రాంతానికి చెందిన జెనీలా అనే యువతి నెలలు నిండడంతో కాన్పు కోసం అనేక ఆసుపత్రులు తిరిగి, ఆయా ఆసుపత్రి వర్గాలు సకాలంలో స్పందించకపోవడంతో మృతి చెందడం తెలిసిందే. ఆమెకు పుట్టిన మగబిడ్డ కూడా ముందే మరణించడం జరిగింది.

గద్వాల జిల్లా చినతాండ్రపాడు గ్రామానికి చెందిన కిశోర్ కుమార్ అనే న్యాయవాది ఈ ఘటనను లేఖ ద్వారా హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఈ ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. చిన్న ఆరోగ్య సమస్యకు 6 ఆసుపత్రులకు తిప్పారని కోర్టు వ్యాఖ్యానించింది. అత్యవసర కేసుల చికిత్సలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని స్పష్టం చేసింది.
Telangana High Court
Mother
Child
Death
Jogulamba Gadwal District
Telangana

More Telugu News