Chandrababu: మద్యం షాపుల ముందు ఈ దృశ్యాలు చూసి షాక్ అయ్యాను: వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు

chandrababu fires on ap govt

  • కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు
  • భౌతిక దూరం పాటించట్లేదు
  • జగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు
  • ఏపీలో కరోనా విజృంభిస్తోంది

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల ముందు మందుబాబులు కిలోమీటర్ల మేర క్యూలు కట్టడం, భౌతిక దూరం పాటించకపోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను ఆయన పోస్ట్ చేశారు.

'ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల ముందు ఈ దృశ్యాలను చూసి షాకయ్యాను. మద్యం షాపుల ముందు మద్యం ప్రియులు భారీగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ జగన్‌ ముందస్తు ప్రణాళికలు వేసుకోలేదు. సామాజిక దూరం నిబంధనలు పాటించాలన్న జాగ్రత్తలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలోనూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి' అంటూ ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News