Donald Trump: ఈ ఏడాది చివరి కల్లా అమెరికా వ్యాక్సిన్‌ను తీసుకొస్తుంది: ట్రంప్

Trump says US to have coronavirus vaccine by end of year
  • సెప్టెంబరులో బడులు, విశ్వ విద్యాలయాలు తెరవాలని చెబుతాను
  • ఏ దేశమైనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తే హ్యాట్సాఫ్ చెబుతా 
  • కరోనాకు వ్యాక్సిన్‌ రావడమే ముఖ్యం
కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తోన్న వేళ ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్ ను తీసుకొస్తామని చెప్పారు. అమెరికాలో పాఠశాలలు, విశ్వ విద్యాలయాలు సెప్టెంబరులో తిరిగి ప్రారంభించాలని తాను ఆయా విద్యా సంస్థలను కోరతానని ట్రంప్ చెప్పారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి పోటీ పడుతున్న విషయంపై ట్రంప్ స్పందిస్తూ... అమెరికా పరిశోధకుల కంటే ముందే ఏ దేశమైనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తే హ్యాట్సాఫ్ చెబుతానని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌ను ఎవరు అభివృద్ధి చేశారన్న విషయాన్ని తాను పట్టించుకోనని, కరోనాకు వ్యాక్సిన్‌ రావడమే ముఖ్యంగా భావిస్తానని చెప్పారు.

వ్యాక్సిన్‌ను తొందరగా కనుగొనే క్రమంలో మనుషులపై ట్రయల్స్‌ జరుపుతున్న నేపథ్యంలో వారికి హాని ఉన్న విషయంపై ట్రంప్ మాట్లాడుతూ... ట్రయల్స్‌ కోసం మనుషులు స్వచ్ఛందంగానే ముందుకు వస్తున్నారని, వారు ఏం చేస్తున్నారో వారికి తెలిసే ముందుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా, కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనే క్రమంలో ఇప్పటికే పలు దేశాలు మనుషులపై ట్రయల్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Donald Trump
america
COVID-19

More Telugu News