Joy Alukkas: అది అవాస్తవం... 'జోయలుక్కాస్' మృతి వార్తలపై వివరణ ఇచ్చిన సంస్థ!

Joy Alukkas Clarification on Fake News
  • జోయలుక్కాస్ మరణించినట్టు ప్రచారం
  • దుబాయ్ లో జోయ్ అరక్కల్ అనే వ్యాపారి మరణం
  • పేరు దగ్గరగా ఉండటంతోనే అయోమయం
దేశ విదేశాల్లో జ్యూయెలరీ రిటైల్ చైన్ ను నిర్వహిస్తున్న జోయలుక్కాస్‌ సీఎండీ జోయలుక్కాస్‌ మరణించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, ఆయన క్షేమంగా ఉన్నారని సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయన అనారోగ్యానికి గురయ్యారని సోషల్ మీడియాతో పాటు, మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని పేర్కొంది.

దుబాయ్ ‌లో జోయ్ అరక్కల్ అనే వ్యాపారి మరణించగా, సదరు వ్యాపారి పేరు తమ సంస్థ సీఎండీ పేరుకు దగ్గరగా ఉండటంతోనే ఇలా జరిగిందని భావిస్తున్నామని వెల్లడించింది. జోయలుక్కాస్ సంస్థకు, జోయ్ అరక్కల్ కు సంబంధం కూడా లేదని వివరణ ఇచ్చింది.
Joy Alukkas
News
Fake News

More Telugu News