Police: దారుణం.. యువకుడు చేతులెత్తి దండం పెడుతున్నా.. లాఠీతో ఇష్టం వచ్చినట్లు కొట్టిన పోలీసు.. వీడియో ఇదిగో

On Camera UP Cops Torture Man Call It Use Of Minimal Force
  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన స్థానికులు
  • మానసిక పరిస్థితి బాగోలేని వ్యక్తిపై కానిస్టేబుల్ ప్రతాపం
  • కానిస్టేబుల్‌ సస్పెండ్‌
ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఓ పోలీసు ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో సమాజ్ వాదీ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తనను కొట్టొద్దని ఆ యువకుడు చేతులెత్తి వేడుకుంటున్నప్పటికీ కనికరం లేకుండా లాఠీతో పోలీసు దారుణంగా కొట్టాడు.

ఆ యువకుడి ఛాతీపై తన బూటు కాలు పెట్టి నొక్కి పట్టి చెరుకుగడతోనూ కొడుతూ ఆ పోలీసు కానిస్టేబుల్‌ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. బాధితుడు సునీల్‌ యాదవ్‌ మానసిక స్థితి బాగోలేదని, అతడు తాగుడుకు అలవాటు పడి గ్రామస్థులపై దాడులకు పాల్పడుతున్నాడని చెప్పారు. గ్రామస్థుల నుంచి ఫిర్యాదు అందుకుని ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారని తెలిపారు. అతడిని కొట్టిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. 
Police
Lockdown
Viral Videos
Uttar Pradesh

More Telugu News