Sadhu: ఇద్దరు సాధువుల హత్య కేసులో నిందితుడికి కరోనా పాజిటివ్

Man who killed Sadhus tests corona positive
  • మహారాష్ట్రలో ఇద్దరు సాధువులు, డ్రైవర్ ను హత్య చేసిన దుండగులు
  • నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ
  • అతనితో ఉన్న మరో 20 మందికి కరోనా పరీక్షలు
మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఇటీవల ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్ పై కొందరు మూకదాడి చేసి చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో నిందితుడైన ఒక వ్యక్తి అస్వస్థతకు గురి కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది.

వెంటనే అతన్ని జైల్లోని ఆసుపత్రిలో ఉన్న ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కేసు విచారణ సమయంలో నిందితుడితో పాటు మరో 20 మందిని పోలీస్ స్టేషన్లోని ఒకే సెల్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా ఇప్పుడు కరోనా టెస్టులను నిర్వహిస్తున్నారు.
Sadhu
Murder
Maharashtra
Corona Virus

More Telugu News