Mahesh Babu: మన వైద్య సిబ్బంది పట్ల మర్యాదపూర్వకంగా మెలగండి: మహేశ్ బాబు

Mahesh Babu urges give huge respect for medical staff
  • వైద్య సిబ్బందిపై మహేశ్ బాబు ప్రశంసలు
  • సూపర్ హీరోలంటూ కితాబు
  • అపారమైన గౌరవం ఇవ్వాలంటూ విజ్ఞప్తి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా పరిస్థితులపై స్పందించారు. కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ముందుండి నిలిచి పోరాడుతున్నది వైద్య సిబ్బంది అని, వాళ్లు మన సూపర్ హీరోలని కొనియాడారు. అలాంటి పోరాటవీరుల పట్ల మర్యాదపూర్వకంగా, దయతో మెలగాలని అందరినీ అర్థిస్తున్నానంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. వారికి అపారమైన గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంటివద్దే ఉంటూ సురక్షితంగా ఉండాలని, కరోనాపై తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Mahesh Babu
Medical Workers
Corona Virus
Pandemic
COVID-19

More Telugu News