Tollywood: నిజంగానే సిగరెట్‌ కాల్చానని చెప్పేసిన యాంకర్ హరితేజ!

hariteja about ciggarate smoking
  • అభిమానులతో సోషల్ మీడియాలో చాటింగ్ 
  • 'హిట్‌' సినిమాలో పాత్ర డిమాండ్‌ చేసిందని వ్యాఖ్య
  • తాను 24.02.1992న పుట్టానన్న హరితేజ
యాంకర్‌ హరితేజ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో మాట్లాడింది. ఈ సందర్భంగా, ఆమె నటించిన 'హిట్‌' సినిమా గురించి ఓ అభిమాని ప్రస్తావిస్తూ... ఆ‌ సినిమాలో ఆమె చేసిన షీలా పాత్ర చాలా బాగుందని, ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో మీరు సిగరెట్‌ కాల్చారని గుర్తు చేశాడు. మరి నిజంగానే అప్పుడు సిగరెట్‌ కాల్చారా మేడం? అని ప్రశ్నించాడు.

దీంతో యాంకర్‌ హరితేజ సమాధానం చెబుతూ, హిట్‌ సినిమాలో తాను పోషించిన పాత్ర డిమాండ్‌ చేసిందని, దీంతో తప్పలేదని, నిజంగానే తాను సిగరెట్‌ కాల్చానని తెలిపింది. కాగా, ఆమె తన వయసెంతో కూడా ఈ సందర్భంగా చెప్పేసింది. వయసెంతో చెప్పాలని ఓ నెటిజన్ అడగగా.. తాను ఈ విషయం చెబితే ఎవరూ నమ్మరని అంటూనే, 24.02.1992న తాను పుట్టానని చెప్పుకొచ్చింది.
Tollywood
Twitter
Instagram

More Telugu News