Nara Lokesh: గతంలో మంత్రిగా నా మొదటి సంతకాన్ని ఆ ఫైలుపైనే చేశాను: మేడే సందర్భంగా లోకేశ్ వ్యాఖ్యలు

lokesh fires on ap govt
  • ఉపాధిహామీ చట్టం కింద 30 లక్షల శ్రామిక కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం
  • భవన నిర్మాణ సంక్షేమ మండలిలో వారికి చోటు కల్పించాం
  • గడచిన ఏడాది ఏపీలో కార్మికులకు మంచి జరగలేదు
  • ఇసుక కొరత, ప్రభుత్వ ప్రోత్సాహం లేక పరిశ్రమలు మూతపడ్డాయి
తమ కష్టంతో జాతి సంపదను పెంచే కార్మికులు, శ్రామికుల సంక్షేమాన్ని విస్మరించి ప్రపంచంలో ఏ సమాజమూ ముందుకు పోలేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. అందుకే మేడే అన్నది విశ్వవ్యాప్త వేడుక అయిందని చెప్పారు.

గతంలో మంత్రిగా తన మొదటి సంతకాన్ని ఉపాధిహామీ చట్టం కింద 30 లక్షల శ్రామిక కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఫైలుపైనే చేశానని తెలిపారు. భవన నిర్మాణ సంక్షేమ మండలిలో ఉపాధి హామీ కార్మికులకు చోటు కల్పించానని లోకేశ్ చెప్పారు. గడచిన ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో కార్మికులకు ఏ మాత్రం మంచి జరగలేదని ఆయన విమర్శించారు.

ఇసుక కొరత, ప్రభుత్వ ప్రోత్సాహం లేక పరిశ్రమలు మూతపడటం, ఆ తర్వాత లాక్ డౌన్ తో కార్మికులు చాలా నష్టపోయారని, వారు అష్టకష్టాలు పడ్డారని అన్నారు. రానున్న రోజుల్లోనైనా కార్మికులకు, శ్రామికులకు మంచి జరగాలని కోరుకుంటున్నానని, వారందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News