May Day: కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక: వైఎస్ జగన్

YS Jagan May Day Wishes to Labour
  • నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం
  • కార్మికుల వద్ద ఆర్థిక పురోగతి సాధ్యం
  • ట్విట్టర్ లో జగన్ శుభాకాంక్షలు
నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు.

 "కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. కార్మికుల స్వేదం, రక్తంతోపాటు వారి జీవితాలను ధారబోయడం వల్లే ప్రపంచ పురోగతి, ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధ్యమవుతోంది. మే ఒకటో తేదీ కార్మిక  పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక. మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులకు శుభాకాంక్షలు" అని జగన్‌ ట్వీట్‌ చేశారు. కాగా, కరోనా కారణంగా నేడు మేడే హంగు, ఆర్భాటాలు లేకుండా కార్మికులు జరుపుకుంటున్నారు.
May Day
Jagan
Wishes
Twitter

More Telugu News