Narasaraopet: నరసరావుపేటలో పూర్తి స్థాయి లాక్ డౌన్ పొడిగింపు

Full fledged lock down extended in Narasaraopet
  • నరసరావుపేటలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
  • ‘కరోనా’ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోతే లాక్ డౌన్  పొడిగిస్తాం
  • లాక్ డౌన్ లో బయటకు రాకుండా ప్రజలు సహకరించాలి
నరసరావుపేటలో మరో మూడు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను పొడిగించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నరసరావుపేటలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. స్థానిక వరవకట్టలో ‘కరోనా’ వ్యాప్తి తగ్గుదలకు పాటించాల్సిన నియమాలను వివరించారు. ‘కరోనా’ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోతే లాక్ డౌన్ ను పొడిగిస్తామని అన్నారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు బయటకు రాకుండా ఇళ్లలోనే వుండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Narasaraopet
Guntur District
Lockdown
District Collector
Anand

More Telugu News