Vijayadevarkonda: ఇప్పటికే 77,000 వినతులు వచ్చాయి.. ప్రస్తుతం కొత్త రిక్వెస్ట్ లు స్వీకరించట్లేదు: హీరో విజయ్ దేవరకొండ

Hero VijayaDevara konda update about MCF
  • రెండు వేల కుటుంబాలకు పైగా సాయం చేయాలనుకున్నా
  • ఆ లక్ష్యాన్ని ఈరోజుతో చేరుకున్నాం
  • దాతల వితరణ కారణంగా 6 వేల ఫ్యామిలీలకు సాయం చేయగలం
లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలకు సైతం ఇబ్బందిపడుతున్న మధ్య తరగతి కుటుంబాల కోసం మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్)ను ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన తాజా వివరాలను తెలియజేస్తూ విజయ్ దేవరకొండ ఓ ప్రకటన చేశారు.

ఈ ఫండ్ ద్వారా రెండు వేల కుటుంబాలకు పైగా సాయం చేయాలనుకున్నామని, ఆ లక్ష్యాన్ని ఈరోజుతో చేరుకున్నామని తెలిపారు. దాతలు తమ వితరణతో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ కుటుంబాలకు.. దాదాపు ఆరువేల ఫ్యామిలీలకు సాయం చేయగలిగేలా చేశారని పేర్కొన్నారు. తమకు సాయం చేయాలని కోరుతూ గత ఐదు రోజులుగా 77,000 వినతులు తమకు అందాయని తెలిపారు.

ఎంసీఎఫ్ లో మిగిలి ఉన్న నిధుల మేరకు అభ్యర్థించిన అందరికి సాయపడలేమని చెప్పాల్సి రావడం దురదృష్టకరంగా భావిస్తున్నానని అన్నారు. అందుకని, ప్రస్తుత తరుణంలో కొత్త వినతులను స్వీకరించడం లేదని స్పష్టం చేశారు. ఫండ్ లో ఉన్న నిధుల లభ్యత మేరకు ఇప్పటికే విన్నవించుకున్న వారికి సాధ్యమైనంత మేరకు సాయపడే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇబ్బంది పడుతున్న మరిన్ని కుటుంబాలకు తాము సాయం అందించాలంటే, తమతో చేతులు కలిపి, విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Vijayadevarkonda
Tollywood
MIddle class Foundation

More Telugu News