Allu Arjun: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్

Allu Arjun appreciates Aussies cricketer David Warner
  • బుట్టబొమ్మా పాటకు డ్యాన్స్ చేసిన వార్నర్
  • మురిసిపోయిన బన్నీ
  • మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ ట్వీట్
కరోనా దెబ్బకు క్రికెట్ ప్రపంచం కూడా ఇంటికే పరిమితమైంది. లాక్ డౌన్ కారణంగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో ఇంట్లోనే ఉంటున్న ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ టాలీవుడ్ హిట్ సాంగ్ 'బుట్టబొమ్మా, బుట్టబొమ్మా' పాటకు తన అర్ధాంగితో కలిసి టిక్ టాక్ వీడియోలో స్టెప్పులేయడం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆ వీడియో ఎంతో వైరల్ గా మారింది. దీనిపై టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ స్పందించాడు.

"థ్యాంక్యూ వెరీ మచ్. మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. బన్నీ ట్వీట్ పట్ల వార్నర్ సైతం అంతే వినమ్రంగా బదులిచ్చాడు. 'థాంక్యూ సర్. మీ పాట అద్భుతంగా ఉంది" అంటూ ట్వీట్ చేశాడు.

బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అల... వైకుంఠపురములో' చిత్రంలోనిదే 'బుట్టబొమ్మా' సాంగ్. తమన్ సంగీతంలో వచ్చిన ఈ పాట అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను సైతం సమ్మోహితులను చేసింది. ఇప్పుడు దేశాల ఎల్లలు దాటి ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ కుటుంబాన్ని సైతం ఆకట్టుకుంది.
Allu Arjun
David Warner
Butta Bomma
Ala Vaikunthapuramulo
Tollywood
Cricket
Australia

More Telugu News