rishi kapoor: రణ్‌బీర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్, మహేశ్ బాబు

pawan mahesh on rishi kapoor death
  • రిషికపూర్‌ ఆకస్మిక మరణం చాలా బాధ కలిగించింది
  • ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు
  • ఆయన ఓ నిజమైన లెజెండ్
రిషి కపూర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 'గొప్ప నటుడు రిషికపూర్‌ ఆకస్మిక మరణం చాలా బాధ కలిగించింది. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. రిషికపూర్ కుటుంబానికి నా సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి' అని పవర్ స్టార్ పవన్ ‌కల్యాణ్‌ ట్వీట్ చేశారు.

రిషికపూర్ మృతి పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందిస్తూ.. 'రిషికపూర్‌ మృతి చెందారన్న వార్త తెలుసుకుని నా హృదయం ద్రవించింది. ఆయన మృతి సినిమా పరిశ్రమకు తీరని మరో లోటు. గొప్ప నైపుణ్యాలు‌ ఉన్న వ్యక్తి. ఆయన ఓ నిజమైన లెజెండ్‌. రణ్‌బీర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ చేశారు.
 
నిన్న ఇర్ఫాన్, నేడు రిషికపూర్‌ మృతి వార్తలు కలచివేశాయని విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. 'రెండు రోజుల్లో ఇలాంటి విచారకర వార్తలు వినడం బాధగా ఉంది. మనం ఇద్దరు గొప్ప నటుల్ని కోల్పోయాం. అందర్నీ సంతోష పెట్టిన బాలుడిగానూ రిషికపూర్‌ మన అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఆయనను కలిసిన ప్రతిసారి నేను గొప్ప విషయాలు నేర్చుకున్నాను. ఆయన మృతి ఓ పెద్ద లోటు. ఆయన  కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి' అని వెంకటేశ్‌ అన్నారు. వారితో పాటు టాలీవుడ్‌ ప్రముఖులంతా రిషికపూర్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
rishi kapoor
Pawan Kalyan
Mahesh Babu
Tollywood

More Telugu News