Chandrababu: పులివెందుల వంటి ప్రాంతానికి కూడా నీటిని అందించాం: చంద్రబాబు

 We have also provided water to the area like Pulivendula says Chandrababu
  • ప్రజలందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు
  • తెలుగుగంగ మొదలు.. పోలవరం వరకు తెలుగు దేశం చేసిన భగీరథ ప్రయత్నాలకు నిదర్శనాలే
  • జలం ఉన్న చోటే సంస్కృతి, నాగరికత జనిస్తాయి
  • జల సంరక్షణ, ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ కృషి  
జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికత జనిస్తాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.  ఈ రోజు భగీరథ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగీరథుని స్పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో జల సంరక్షణ, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ నిరంతరం కృషి చేసిందని ఆయన ట్వీట్ చేశారు. పులివెందుల వంటి ప్రాంతాలకు కూడా నీటిని అందించామని చెప్పారు. తెలుగుగంగ మొదలు.. నిన్నటి పట్టిసీమ ఎత్తిపోతలు, పోలవరం వరకు తమ పార్టీ చేసిన ప్రయత్నాలకు నిదర్శనాలే అని అన్నారు.

‘దేశం ఈరోజు భగీరథ జయంతిని జరుపుకుంటోంది. జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికత జనిస్తాయి. అందుకే మన భారత సంప్రదాయంలో గంగను భూమ్మీదకు తెచ్చి ప్రజలకు వరంగా అందించిన భగీరథుడంటే అంతటి పూజ్యభావం. భగీరథుని స్ఫూర్తిగా జల సంరక్షణకు, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సదా కృషి చేసింది తెలుగుదేశం. ఎన్టీఆర్ నాటి తెలుగుగంగ మొదలు నిన్నటి పట్టిసీమ ఎత్తిపోతలు, పోలవరం వరకు తెలుగుదేశం చేసిన భగీరథ ప్రయత్నాలకు నిదర్శనాలే. పులివెందుల వంటి ప్రాంతానికి కూడా నీటిని అందించాం. నీరు-ప్రగతి కార్యక్రమంతో నీటి వనరులను పెంపొందించాం. ప్రజలందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు’ అని చంద్రబాబు వరుస ట్వీట్స్‌ చేశ్వారు.
Chandrababu
wishes
bhagiratha
jayanthi
pulivendula

More Telugu News