సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అవకాశాల గురించి కృతి సనాన్
- 'ఎఫ్-3'లో మరో హీరో కూడా!
- నితిన్ కి హీరోయిన్ ఖరారు
* వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో మరో హీరో కూడా నటిస్తాడట. అయితే, అది గెస్ట్ రోల్ అనీ, ప్రముఖ హీరో ఆ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.
* ప్రస్తుతం శర్వానంద్ సరసన 'శ్రీకారం' చిత్రంలో నటిస్తున్న అందాలభామ ప్రియాంక అరుల్ మోహన్ త్వరలో నితిన్ పక్కన నటించనుంది. హిందీ చిత్రం 'అంధాదూన్'ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ప్రియాంకను కథానాయికగా తీసుకుంటున్నట్టు సమాచారం.