Irfankhan: ముగిసిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు

Bollywood Artist Irfan Khan funerals
  • అనారోగ్యంతో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి
  • ముంబయిలోని వెర్సోవా కబర్ స్తాన్ లో ఖననం
  • ఇర్ఫాన్ కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరు
తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని వెర్సోవా కబర్ స్తాన్ లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇర్ఫాన్ భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఈ విషయాన్ని ఇర్ఫాన్  కుటుంబసభ్యులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇర్ఫాన్ కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరై తుది నివాళులర్పించామని, ఇర్ఫాన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్టు చెప్పారు.

కాగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ఈరోజు మృతి చెందాడు. ఇర్ఫాన్ మృతిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Irfankhan
Bollywood
funerals
Mumbai

More Telugu News