Pawan Kalyan: ఏపీ రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు విడుదల చేయాలి: పవన్ కల్యాణ్ డిమాండ్ 

Janasena founder Pawankalyan criticises AP Government
  • కష్టాల్లో ఉన్న వారిపై కేసుల పేరిట వేధింపులు తగవు
  • భూమి ఇచ్చిన రైతులు, భూమి లేని పేదలపై సానుభూతి చూపాలి
  • రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు సత్వరమే నిలిపివేయాలి 
ఏపీ రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న వారిపై కేసుల పేరిట వేధింపులు తగవని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని, పాత కేసుల పేరుతో రైతులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం తగదని అన్నారు. భూమి ఇచ్చిన రైతులు, భూమి లేని పేదల పట్ల సానుభూతి చూపాలని కోరారు. రైతులను ఇబ్బంది పెట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Government

More Telugu News