Jammu And Kashmir: షోపియాన్‌లో నిన్న సాయంత్రం నుంచి ఎదురు కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

firing in jammu kashmir
  • సోదాలు చేస్తుండగా కాల్పులకు దిగిన ఉగ్రవాదులు
  • ప్రతిఘటించిన భద్రతా బలగాలు
  • మరో ఉగ్రవాదిని హతమార్చేందుకు కొనసాగుతున్న కాల్పులు
జమ్మూకశ్మీర్‌లో నిన్న సాయంత్రం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. నిన్న రాత్రి భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చగా, ఈ రోజు ఉదయం మరో ఉగ్రవాదిని హతమార్చాయి. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా మెల్‌హురా ప్రాంతంలో భద్రతా బలగాలు సోదాలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో భద్రతా బలగాలు ఎన్‌ కౌంటర్ చేశారని అధికారులు ప్రకటించారు.

ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. అదే ప్రాంతంలో మరో ఉగ్రవాది దాక్కున్నాడని, అతడిని కూడా హతమార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. వారి ప్రయత్నాలను భగ్నం చేయడానికి భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కుల్గాం జిల్లాలోని కవ్జిగుండ్‌లో సోమవారం కూడా ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చారు.
Jammu And Kashmir

More Telugu News