Irfan Khan: మృత్యువుతో పోరాడుతున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్!

Actor Irfan Khan Health Condition Very Serious
  • గతంలో క్యాన్సర్ నుంచి కోలుకున్న ఇర్ఫాన్
  • ఆపై పెద్ద పేగు వ్యాధితో క్షీణించిన ఆరోగ్యం
  • చనిపోయాడన్న ప్రచారం అవాస్తవమన్న బంధుమిత్రులు
కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి సోకగా, చికిత్స తరువాత కోలుకున్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. పెద్ద పేగు సంబంధిత వ్యాధి సోకడంతో, ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

అతని ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన బంధుమిత్రులు, కొందరు పనిగట్టుకుని ఇర్ఫాన్ మరణించాడని ప్రచారం చేస్తున్నారని, ఆయన జీవించే వున్నారని తెలిపారు. అభిమానుల్లో ఆందోళన కలిగించే ప్రచారం చేయవద్దని, ఆయన ఆరోగ్యం బాగా లేకున్నా, కోలుకుంటారన్న నమ్మకం ఉందని తెలిపారు.

కాగా, ఇర్ఫాన్ తల్లి సైదా బేగమ్ శనివారం నాడు కన్నుమూయగా, లాక్ డౌన్ తో పాటు ఆరోగ్యం విషమంగా ఉన్న కారణంగా అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరు కాలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లిని కడసారి చూపు చూశారు.
Irfan Khan
Hospital
Serious

More Telugu News