Ashutosh Koushik: టెర్రస్ పై పురోహితుడు, మరో నలుగురు... పెళ్లి తంతు ముగించేసిన బిగ్ బాస్ విన్నర్!

Biggboss Winner Asutosh Marriage with Arpita on Terrece with 4 Relatives
  • అర్పితను వివాహం చేసుకున్న అశుతోశ్ కౌశిక్
  • వధువు తరఫున తల్లి, సోదరుడు, అశుతోశ్ తల్లి, సోదరి మాత్రమే హాజరు
  • మిగుల్చుకున్న డబ్బును పీఎం కేర్స్ కు ఇస్తానని వెల్లడి
బిగ్ బాస్ సీజన్ 2 విజేత అశుతోశ్ కౌశిక్, అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నాడు. అలీఘర్ కు చెందిన అర్పితను పెళ్లి చేసుకున్న అశుతోశ్, తన ఇంటి టెర్రెస్ నే వివాహ వేదికగా మలచుకున్నాడు. పురోహితుడు కాకుండా మరో నలుగురు మాత్రమే వివాహానికి హాజరయ్యారు. అశుతోశ్ తల్లి, సోదరి, అర్పిత తల్లి, సోదరుడు మాత్రమే పెళ్లిని చూశారు.

ఇక, తన వివాహం నిరాడంబరంగా జరుపుకోవడం ద్వారా మిగిలిన డబ్బును పీఎం కేర్స్ కు విరాళంగా ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా అశుతోశ్ వెల్లడించారు. రియాల్టీ షోల స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అశుతోశ్, గతంలో బిగ్ బాస్ తో పాటు రోడీస్ సీజన్ 5లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా అతి కొద్ది మంది సమక్షంలోనే వివాహం జరిగినప్పటికీ, తనకు వ్యక్తిగతంగానూ హంగు, ఆర్భాటాలు ఇష్టం లేవని అశుతోశ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Ashutosh Koushik
Marriage
Arpita
Biggboss
Season 2 Winner

More Telugu News